అలాగే బ్రొకలీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేసే గుణాలను కలిగి ఉంటుంది. అంతేగాకుండా ఎక్కువ మొత్తంలో ఫైబర్ స్థాయులను కలిగి వుండి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఆహారంలో అధిక కెలోరీలు, కొవ్వులను అందించే ఆహారాలకు బదులుగా బ్రొకలీని కలుపుకోవాలి.
బరువు తగ్గించడంలో సహాయపడే మరొక అద్భుతమైన ఆహారంగా నారింజ పండును తినాలి. ఎక్కువ కేలోరీలను అందించే వంటకాలకి బదులుగా నారింజ పండ్లను తినటం మంచిది. నారింజ పండులో అధిక మొత్తంలో ఫైబర్ విటమిన్ 'సి'లను కలిగి ఉండి, జీవక్రియ రేటును పెంచి ఆకలి అనిపించకుండానే శరీర బరువు తగ్గిస్తాయి.
క్యాబేజీని మీ ఆహర ప్రణాళికలో కలుపుకోవటం వలన ఆకలి తగ్గుతుంది. శరీర అధిక బరువును తగ్గించటంలో సహాయపడటమే కాకుండా, అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్'లను, విటమిన్ 'సి' కలిగి ఉండి, జీవక్రియ రేటును మెరుగుపరచి, శరీర రోగనిరోధక వ్యవస్థ శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.