రోగనిరోధక శక్తికి ఆహార నియమాలివే..?

మంగళవారం, 8 జనవరి 2019 (10:16 IST)
ఆహారం విషయంలో సరైన అవగాహన, శ్రద్ధ లేకపోవడం వలన, ప్రకృతి వైపరీత్యముల వలన అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. అనారోగ్యమునకు ప్రధానమైన కారణం మలబద్ధకం. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వలన రకరకాల వ్యాధులు కలుగుచున్నాయి. కనుక సులభంగా జీర్ణమగు ఆహారమును తీసుకున్నచో మలబద్ధకము నుండి తప్పించుకోవచ్చును. 
 
తోటకూర, మెంతికూర, పాలకూర మొదలగు ఆకుకూరలు, బీర, పొట్ల, ముల్లంగి, టమోటా మొదలగు కూరలను, ద్రాక్ష వంటి పండ్లను, ధ్యానముపై ఉండు తౌడును ఉపయోగించడం మంచిది. బలహీనంగా ఉన్నవారు.. నారింజ, ఆపిల్ మొదలగు పండ్ల రసమును సేవించిన ఆకలి పెరుగును. ఆకలి వృద్ధియైన కొలది, కొంచెం కొంచెం ఆహారమును క్రమంగా పెంచి తీసుకొనవలయును. తక్కువగా క్రొవ్వు పదార్థములను కూడా భుజించవలయును. 
 
క్యాల్షియం, ఐరన్, విటమిన్స్ ఎక్కువగా, మాంసకృత్తులు తక్కువగా కలిగిన ఆహార పదార్థాలు తినాలి. అప్పుడే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. స్థూల శరీరముతో బాధపడువారు, తీపి పదార్థములను, క్రొవ్వు పదార్థాములను, పిండి పదార్థములను తగ్గించి, ఆకుకూరలు, పండ్లు, మజ్జిగా ఆహారంగా తీసుకోవలయును. వీలైనంతసేపు నడవడం మంచిది. చెమట ఎక్కువగా పట్టునట్లు చేయవలెను. ఇలా చేయడం వలన శరీరం నందలి మలినములు తొలగిపోవును.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు