టీ చర్మాన్ని నల్లగా మారుస్తుందా? లేదా అది ఒక మూఢనమ్మకమా?

బుధవారం, 9 మే 2018 (11:48 IST)
టీ త్రాగటం వలన చర్మం నల్లగా మారుతుంది అనేది ఒక అపనమ్మకం మాత్రమే. చర్మం శరీర ఆకృతి, రూపు రేఖలపైన మాత్రమే చర్మ రంగు ఆధారపడి ఉంటుంది. మీ చర్మ రంగు మారటానికి మీరు త్రాగే టీ మాత్రం ముమ్మాటికీ కారణం కాదు. టీ, కాఫీ అధికంగా ఉండే వంటి ద్రావణాలు మీ చర్మాన్ని ఏ విధంగాను ప్రభావితం చేయవు. పండ్లు, కూరగాయలలో ఉన్నట్లుగానే టీలో కూడా చాలా రకాల యాంటీ-ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి గుండెకు సంబంధించిన వ్యాధులకు, క్యాన్సర్‌ల అభివృద్ధిని నిరోధిస్తాయి.
 
అంతేకాకుండా టీని మాములుగా కాకుండా అధికంగా త్రాగటం వలన చర్మాన్ని డీహైడ్రేషన్‌కు గురిచేసి, చర్మ రంగును మారుస్తుంది. వీటికిగురైన చర్మకణాలు చూడటానికి పొడిగా, నిర్జీవంగా కనిపిస్తాయి, దీనివల్ల చర్మం నల్లగా మారుతుంది. అయినప్పటికి, టీ వలన చర్మం నల్లగా మారదు, కారణం ఈ పద్ధతి ప్రకారం చర్మం మారటానికి ఎక్కున సమయమే పడుతుంది. రోజులో ఎక్కువ మెుత్తంలో టీ త్రాగటం వలన చర్మం నల్లగా మారే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. మీ చర్మం నల్లగా మారటానికి టీ కారణం కాకపోవచ్చు. నిద్ర లేకపోవటం, ఒత్తిడి లేదా ఇతర ఆరోగ్య సమస్యల వలన కూడా చర్మం నల్లగా మారే అవకాశం ఉంది.
 
చర్మంలో మార్పులు జరిగితే చాలు టీ వలన అని చెప్పటం అందరికి చాలా సాధారణం అయిపోయింది. అంతేకాకుండా, సూర్యరశ్మికి బహిర్గతం అవటం, కొన్ని రకాల చర్మ సమస్యల వలన కూడా చర్మ రంగులో మార్పులు రావచ్చు. చర్మం అనారోగ్యానికి గురికావడం లేదా చర్మ రంగు మారటానికి సూర్యరశ్మి ఒక కారణంగా  చెప్పవచ్చు. నిజమైన చర్మ రంగు, వ్యక్తి యెుక్క జన్యువులు అతడు సూర్యరశ్మికి బహిర్గతం అయ్యే స్థాయిలను బట్టి చర్మ రంగు మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు