అల్లంతో కీళ్లనొప్పులకి చెక్ పెట్టండి

శనివారం, 9 జనవరి 2016 (11:10 IST)
అల్లం ఒక సహజ ఔషదకారిణి. అలాగే అల్లంతో టీ చేసుకుని తాగితే ఆ మజాయే వేరు. సాధారణంగా సగటు మనిషి రోజుకు నాలుగు గ్రాములు అల్లం తీసుకోవటం మంచిది అంటున్నారు నిపుణులు. అల్లం వంటకు రుచి చేకూర్చడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అటువంటి అల్లం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెల్సుకుందాం!
 
ఉదయాన్నే అల్లం టీ తాగితే ఒంట్లో బలహీనత పోతుంది. పార్శ్వపు తలనొప్పిని తగ్గించే గుణం అల్లంకు ఉంది.
 
కడుపులో తిప్పినట్లుండటం, వాంతులు వంటి సమస్యల్ని అల్లం పోగొడుతుంది. బరువు తగ్గటానికి అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. 
 
క్యాన్సర్‌ కణాలతో పోరాడే గుణం అల్లంలో ఉంది. శరీరంలోని వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.
 
కీళ్లనొప్పుల్నితగ్గించేందుకు అల్లం ఎంతో సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి