ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. వర్షాకాలంలో జలుబు, దగ్గు గొంతు ఆరిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇతరత్రా అనారోగ్యాలు వస్తుంటాయి. అయితే వీటినన్నింటికీ దూరంగా ఉండాలంటే తగిన పోషకాహారం తినాలంటున్నారు వైద్య నిపుణులు.
జీడిపప్పు, ఖర్జూర, బాదం, వాల్ నట్స్ వంటివి ప్రయోజనాన్ని ఇస్తాయట. పెరుగులో ప్రొటీన్ లు, ప్రో..బయోటిక్స్ ఉండి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందట. అలాగే మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క, అల్లం వంటివి ఆహారం త్వరితంగా జీర్ణం కావడానికి ఉపకరిస్తుందట.