శరీరంలో రోగనిరోధక శక్తి లోపిస్తే అనేక రోగాలు మనల్ని కమ్ముకుంటాయి. వాటి నుండి బయటపడటానికి అనేక రకాల మందులు తీసుకుంటాం. దానితోపాటు పౌష్టికాహారం కూడా తీసుకోమని డాక్టర్లు సూచిస్తారు. వైరస్ వలన వచ్చే అంటు వ్యాధులలో జలుబు, దగ్గు కూడా ఉన్నాయి. జలుబు వలన తలనొప్పి, ఆయాసం, తుమ్ములు వస్తాయి.
ఇంగువ చూర్ణాన్ని వేడినీటిలో మరిగించుకుని అందులో కొద్దిగా ఆవునెయ్యి కలుపుకుని ప్రతిరోజూ మూడుపూటలా సేవిస్తే ఆయాసం, తలనొప్పి వంటి సమస్యలు దరిచేరవు. అయనా కూడా తగ్గకపోతే, వాము చూర్ణాన్ని, పటిక బెల్లాన్ని వేడినీళ్లల్లో మరిగించుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణుల సూచన.