గ్యాస్ సమస్యకు గృహ చిట్కాలు... యాలకుల నీటితో శాశ్వత పరిష్కారం!

సోమవారం, 8 ఆగస్టు 2016 (13:09 IST)
ప్రతి ఒక్కరిని అధికంగా వేధించే సమస్య గ్యాస్. ఈ సమస్యకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు, తక్కువ శాతంలో నీటిని సేవించడం. సరైన వేళలో సరైన మోతాదులో ఆహారం తీసుకోకపోవటం వలన కూడా గ్యాస్ సమస్య వస్తుంది. ఈ సమస్యను తొందరగా తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.... అవేంటో ఇప్పుడు చూద్దాం....
 
ప్రతి రోజు కొబ్బ‌రి నీటిని తాగితే మంచిది. క‌డుపులో త‌యార‌య్యే యాసిడ్ల ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది. ఒక స్పూన్ తేనెను సేవిస్తే.. ఎసిడిటీ సమస్య నుంచి త్వరగా ఉప‌శ‌మ‌నం కలుగుతుంది. క‌డుపులోని మ్యూక‌స్ పొర‌ను ర‌క్షించే ఔష‌ధంగా తేనె సహకరిస్తుంది. 
 
రోజూ పాలను తాగడం వల్ల కడుపులో మంట, అసిడిటీ తగ్గుతుంది. పాల‌లో ఉండే కాల్షియం క‌డుపులో అధికంగా ఉన్న ఆమ్లాల‌ను పీల్చుకుని గ్యాస్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. 
 
యాలకులు గ్యాస్ సమస్యను తగ్గించటంలో బాగా పనిచేస్తుంది. కొన్ని యాల‌కుల‌ను తీసుకుని బాగా నలిపి ఒక గ్లాస్ నీటిలో మ‌రిగించాలి. ఆ తర్వాత వచ్చిన ఆ నీటిని వడగట్టుకుని తాగితే క‌డుపు లోప‌లి భాగంలో ఉండే చ‌ర్మం అధికంగా విడుద‌ల‌య్యే యాసిడ్ల బారిన ప‌డ‌కుండా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి