రోజు సుమారు 42 లక్షలకు పైగా స్మార్ట్‌ఫోన్స్ మనం దేశంలో అమ్ముడుపోతున్నాయి. ఈ సంఖ్యను చూస్తుంటే మన దేశంలో మెుబైల్ ఫోన్స్ ఉన్న డిమాండ్ ఏంటో అర్థమవుతుంది. అదే సమయంలో కంట్లో వేసుకునే చుక్కల మందులు కూడా భారీ సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే 54 శాతం ఈ ముందులు అమ్మకాలు సంఖ్య పెరిగింది.
స్మార్ట్‌ఫోన్స్ మన కళ్లలో నీళ్లను ఆవిరి చేస్తుంటాయి. కనుక చాలామంది అధికంగా ఈ కంటి మందులను వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్స్ ప్రపంచంలో సమస్త సమాచారాలను మనకు అందిస్తుంది. అయితే మన అవసరాలు తీర్చడంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువగా స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్, టాబ్స్ వాడడం వలన కళ్లలో ఉండే నీరు ఇంకిపోయి కళ్లు పొడిబారిపోతాయి.