పరుగులుపెట్టే జీవితం అయిపోయింది నేటి ప్రపంచం. ఇదివరకు ఎనిమిది గంటల పాటు పనిచేసి సాయంత్రమయ్యేసరికి ఇంటికి వెళ్లి హాయిగా భోజనం చేసి 8 గంటలకల్లా నిద్రించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందువల్ల మన లైఫ్ స్టయిల్‌కు తగినట్లు వేళ ప్రకారం నిద్రించడం మొదటి సూత్రం. నిద్రకు ఉపక్రమించేందుకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేళ తప్పవద్దు. సరైన నిద్రకు ఆహార నియమం కూడా ఎంతో అవసరం.
నిద్ర చెడగొట్టే పానీయాలను గానీ ఘన పదార్థాలను కానీ తీసుకోకూడదు. దీనివల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. టీ, కాఫీలకు బదులుగా బాదం మిల్కు వంటివి తీసుకోవచ్చు. నిద్రించే ముందు గోరువెచ్చని పాలు గ్లాసుడు త్రాగితే మంచిది.