ఒంటిలో నీరు చేరిందా? చేపలు లాగించండి..!

శనివారం, 16 జులై 2016 (15:37 IST)
ఒంటిలో నీరు చేరిందా? లావుగా కనిపిస్తున్నామని ఫీలింగా ఉందా..? అయితే ఈ టిప్స్ పాటించండి. నీరు ఎక్కువగా తీసుకోకపోవడం ద్వారా శరీరం ఉబ్బినట్లు కనిపిస్తుంది. అందుచేత నీటిని కూడా నిత్యం తగిన మోతాదులో తీసుకోవాల్సిందే. అలాగే శరీరంలో చేరిన నీటిని వెలివేయడంలోనూ మనం శ్రద్ధ చూపాలి. ఇందుకు ఏం చేయాలంటే..? నీటిని బయటికి పంపించడంలో విటమిన్ బి6 బాగా ఉపయోగ పడుతుంది. 
 
ఈ బి6 విటమిన్ ఎక్కువగా పిస్తా, చేపలు, అరటి పండ్లు, పాలకూర, డ్రై ఫ్రూట్స్‌ళో పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా నీటిని శరీరం నుంచి యూరిన్, చెమట రూపంలో తొలగించుకోవచ్చు. అలాగే పొటాషియం కూడా అధిక నీటిని శరీరం నుంచి పంపించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. అరటి పండ్లు, అవకాడోలు, బీన్స్ , పాలకూర వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటికి పోతుంది.
 
ఇంకా శరీరంలో ఉప్పు చేరకుండా చూసుకోవాలి. ఉప్పును అధికంగా తీసుకుంటే.. సోడియం శరీరంలో ఎక్కువ నీరు నిల్వ ఉండేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే చాలు. శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటికి పోతుంది. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో నిల్వ అయ్యే అధిక నీటి సమస్య నుంచి బయటపడవచ్చు. చక్కెర, పిండిప దార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మానేయడం మంచిది. లేదంటే శరీరంలో నీటి నిల్వ అధికమవుతుంది.

వెబ్దునియా పై చదవండి