కేశ రక్షణకు ఇలా చేయాల్సిందే..?

మంగళవారం, 11 డిశెంబరు 2018 (10:54 IST)
శిరోజాలు అందంగా.. మృదువుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చాలామంది వారికి తెలియకుండానే వెంట్రుకల విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని కారణంగా జుట్టు రాలిపోవడం వంటివి జరుగుతుంటాయి. అలా మనం చేసే తప్పులేంటో ఓసారి చూద్దాం..
 
తల స్నానం చేసేటప్పుడు షాంపూను పూర్తిగా శుభ్రం చేయకపోతే వెంట్రుకలపై షాంపూ మిగిలిపోయి దుమ్ము పేరుకు పోయేలా చేస్తుంది. దాంతో జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. కనుక తలస్నానం చేసేముందు దువ్వెనతో దువ్వుకొని స్నానం చేస్తే మంచిది. అలా కాకుండా తడి జుట్టుని దువ్వితే తొందరగా పాడవడమే కాకుండా, జుట్టు రాలిపోతుంది. 
 
దువ్వెనలు శుభ్రపరచకపోవడంతో వాటిల్లో ఉండే దుమ్ము తలమీద పేరుకుపోయి జుట్టును నాశనం చేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దువ్వెనను శుభ్రపరచుకోవాలి. ప్రతిరోజు జుట్టుకు షాంపు వాడితే కుదుళ్ల సమస్య ఏర్పడుతుంది. కాబట్టి వారానికి రెండు నుంచి మూడుసార్లు షాంపూ పెట్టుకుంటే మంచిది. అంతే కాకుండా జుట్టు మొలలకు మాత్రమే షాంపూ వాడితే జుట్టుకు మంచిది.
 
కొంతమంది స్నానం చేసిన వెంటనే తడి జుట్టుతో పడుకుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు తొందరగా పాడవుతుంది. చాలా మంది తలస్నానం చేసేప్పుడు ఎక్కువ వేడి నీటిని ఉపయోగిస్తుంటారు. వేడి నీరు మీ జుట్టులో రంగును తొలగించి నూనె ఉత్పత్తి చేసే గ్రంధులను యాక్టివేట్ చేస్తుంది. గోరువెచ్చని నీరు ఉపయోగిస్తే జుట్టులో ఉన్న మురికిని తొలగించి, రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు