సాధారణంగా అందరిని బాధపెట్టే సమస్య నడుమునొప్పి. ఈ సమస్య దేని వలన వస్తుందంటే ఆహార లోపం, శరీరంలో విటమిన్స్ లేకపోవడం వలన ఎముకలు బలాన్ని కోల్పోయి ఇటువంటి నొప్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నొప్పి నుండి ఉపశమనం లభించేందుకు విటమిన్ డి గల ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చేపలంటేనే గుర్తుకు వచ్చేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇది శరీరానికి అవసరమైయ్యే విటమిన్ డిను అందిస్తుంది. చేపలు తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. తద్వారా నడుమునొప్పి వంటి సమస్యరాదు. చాలామంది చీజ్ అంటే పడిచస్తుంటారు. దీనిని తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. దాంతో బ్యాక్ పెయిన్‌కి చెక్ పెట్టవచ్చును.