నిద్రలేమి ఎందుకు వస్తుందో తెలుసా..?

గురువారం, 13 డిశెంబరు 2018 (10:04 IST)
నేటి తరుణంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి విముక్తి చెందాలని ఏవేవో నిద్రమాత్రలు వాడుతున్నారు. వీటి వాడకం కారణంగా సమస్య ఇంకా ఎక్కువైపోయింది. అంటే.. తరచు ఈ మాత్రలు అలవాటు చేసుకున్నవారికి ఇవి వేసుకుంటేనే నిద్ర పడుతుంది. లేదంటే అసలు నిద్రే ఉండదు. అంతేకాదు.. వీటికి బానిసైపోతున్నారు. ఈ మాత్రలు వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. అసలు నిద్రలేమి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం...
 
1.  ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. కొన్ని కారణాలు వలన వారు సర్జరీ చేయించుకుని గర్భసంచిని తొలగించుకుంటారు. దాంతో మెనోపాజ్ వలనే ఈ నిద్ర సమస్య ఎక్కువగా ఉంటుందని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. కానీ, వయసు పెరిగిన వారిలో మెనోపాజ్ వచ్చిన వారికి ఈ సమస్య అంతగా లేదని కూడా వెల్లడించారు. 
 
3. గర్భసంచిని తీసివేయడం ద్వారా హార్మోన్స్ వ్యవస్థలో, జీవక్రియల్లో చోటుచేసుకునే తేడాలే నిద్రలేమికి కారణమని వారు చెబుతున్నారు. దీని వలన శారీరక సమస్యలే కాకుండా దిగులు, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తే సూచనలున్నాయి. 
 
4. నిద్ర సమస్య తీవ్రంగా ఉంటే తప్ప నిద్రమాత్రలు వాడకూడదు. అందువలన హార్మోన్ వ్యవస్థను, చైతన్యపరిచే యోగాసనాలు, వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిద్రమాత్రలు ఎక్కువ కాలం వేసుకోవడం వలన రకరకాల దుష్ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్తున్నారు. 
 
5. ఈ దుష్ప్రభావాలు ఏర్పడకుండా ఉండాలంటే.. యోగాసనాలు, వ్యాయామాలు చేస్తే ఫలితం కలుగుతుంది. అందువలన ప్రతిరోజూ నిద్రలేచిన తరువాత ఓ పావుగంట పాటు ఆసనాలు చేస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చని.. పరిశోధనలో స్పష్టం చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు