ప్రతిరోజూ కంప్యూటర్ ముందు పనిచేసేవారు..?

శుక్రవారం, 29 మార్చి 2019 (09:59 IST)
నేటి తరుణంలో కంప్యూటర్‌ ముందు పని చేసేవారు ఎక్కువైపోతున్నారు. ఇలాంటివారు తమ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహిస్తే బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు వైద్యులు.
 
మీరు కంప్యూటర్‌తో పని ప్రారంభించిన తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. కళ్ళ క్రింద యాంటీ వ్రింకల్ క్రీమ్ రాసుకోవాలి. దీంతో కళ్ళక్రింద త్వరగా ముడతలు, నల్లటి మచ్చలు ఏర్పడవు. యాంటీ వ్రింకల్ క్రీంలో రెటీనాల్, విటమిన్ సి, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాట్‌లు ఉంటాయి. ఇవి కళ్ళక్రింద మెలెనిన్ రాకుండా కాపాడుతుంది. 
 
ఆరోగ్యకరమైన చర్మం కోసం యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్ వాడడం మంచిది. యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్ వాడడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించబడుతాయి. కళ్ళకు పూర్తి విశ్రాంతినివ్వాలి. దీంతో దాదాపు 8 గంటల సమయం మీరు తప్పనిసరిగా నిద్రపోవాలి. అలా నిద్రపోయినప్పుడే కళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటుంది. నిత్యం అండర్ ఐ జెల్‌ను ప్రయోగించండి దీంతో మీ కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయంటున్నారు వైద్యులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు