పగటి వేళ అధిక సమయం నిద్రించకూడదు. దాంతో రాత్రివేళ నిద్రపట్టదు. నిద్రరాకుండా ఉంటే మీకు ప్రియమైన సంగీతాన్ని వింటూ నిద్రలోకి జారుకోవచ్చు. కొంతమంది నిద్రపట్టేందుకు నిద్రమాత్రలను వాడుతుంటారు. ఈ అలవాటుకు స్వస్తి చెప్పాలి. నిద్రమాత్రలు అనారోగ్యాన్ని దారితీస్తాయి. పదేపదే పడక స్థానాలను మార్చితే కొత్త ప్రదేశం వలన కూడా నిద్ర రాకపోవచ్చు.
వేళ ప్రకారం నిద్రించడం మొదటి సూత్రం. నిద్రకు ఉపక్రమించేందుకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేళ తప్పవద్దు. సరైన నిద్రకు ఆహార నియమం కూడా ఎంతో అవసరం. నిద్రను చెడగొట్టే పానీయాలను, ఘన పదార్థాలను తీసుకోకూడదు. దీనివల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. టీ, కాఫీలకు బదులుగా బాదం పాలు వంటివి తీసుకోవచ్చు. నిద్రించే ముందు గోరువెచ్చని గ్లాసు గోరువెచ్చని పాలు త్రాగితే మంచిది.