పనీర్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, అల్పాహారంలో పన్నీర్ తీసుకునేవారు వున్నారు. పనీర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ప్రోటీన్ కాకుండా, పన్నీర్లో కొవ్వు, ఇనుము, కాల్షియం మరియు మెగ్నీషియం కూడా అధికంగా ఉన్నాయి. ఇది మరింత ఆరోగ్యకరమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. పనీర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. బ్లడ్‌షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది. పనీర్‌లో ఫోలేట్ పుష్కలం. ఫోలేట్ బికాంప్లెక్ విటమిన్. ఇది గర్భిణీలకు ఎంతో ముఖ్యం. గర్భంలోని పిండాభివృద్ధికి ఇది సహకరిస్తుంది.