శ్వాసనాళాలు, రక్తనాళాలు శుద్దిపడాలంటే కూడా బెల్లం ఖచ్చితంగా తినాలి. రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. చక్కెరలా బెల్లం వలన దుష్ప్రభావాలు ఉండవు. శరీరంలోని మలినాలను బయటకు వెళ్లేలా చేస్తుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము.
దగ్గు, జలుబును కూడా బెల్లం సులభంగా దూరం చేయగలదు.
ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో బెల్లం ఎంతగానో తోడ్పడుతుంది.
బెల్లం తింటే ముఖంపై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి. చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.