బెల్లం కలిపిన టీ, కాఫీ, పాలు తాగితే ఎముకలు, కండరాలు దృఢంగా వుంటాయి. బెల్లం కలిపిన పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. జీర్ణ సంబంధిత సమస్య ఉంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే బెల్లం కలిపిన పాలను తీసుకోవడంతో ఉపశమనం లభిస్తుంది.
బాగా ఆడుకునే పిల్లలకు బెల్లం పాలు ఇస్తే తక్షణ శక్తి వచ్చి, ఉత్సాహంగా ఉంటారు. రోజూ పాలు తాగడం వల్ల క్యాల్షియం పెరిగి ఎముకలు బలంగా మారతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జుట్టును రాలనీయకుండా చేస్తుంది. నెలసరి నొప్పులను దూరం చేసుకోవాలంటే పాలలో బెల్లం కలుపుకుని తాగాలి. బెల్లం పాలు తాగితే హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు బెల్లం కలిపిన పాలు ఉపశమనాన్నిస్తుంది.
పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసీ ఆకులు వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. బెల్లం, నెయ్యి సమపాళ్ళల్లో కలిపి తింటే మైగ్రేయిన్ తల నొప్పి తగ్గుతుంది. బెల్లం వల్ల కీళ్ళ ఇబ్బందులు రావని, శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.