వేసవిలో నిమ్మరసం తప్పనిసరి.. దగ్గు, ఫ్లూ, జ్వరం రాకుండా ఉండాలంటే..?

ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (14:13 IST)
నిమ్మ కాయను దివ్యౌషధంగా పేర్కొంటారు. నిమ్మరసంలో ఆమ్లాలు అధికం. అయినా జీర్ణక్రియ సమస్యలను పరిష్కరించటంలో నిమ్మరసం పాత్ర ఉంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగితే మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే అది కాలేయానికి టానిక్‌గా పనిచేసి, పైత్యరసాల ఉత్పత్తిని పెంచుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై, పలురకాల అంటురోగాల నుండి మనల్ని రక్షిస్తుంది. గొంతునొప్పి, ఆస్మా ఇబ్బందుల నుండి ఉపశమనం ఇచ్చే గుణం నిమ్మకుంది. 
 
ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో యాసిడ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది సహజంగా యాసిడ్ గుణాన్ని కలిగి ఉన్నా శరీరంలోకి వెళ్లగానే ఆల్కలైజింగ్ ఏజెంట్‌గా మారుతుంది. కనుక నిమ్మ రసాన్ని ఎవరైనా నిర్భయంగా సేవించవచ్చు. దాంతో శరీర ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతోపాటు పలు బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. ప్రధానంగా జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం వంటివి తగ్గిపోతాయి. వేసవిలో నిమ్మరసం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

వెబ్దునియా పై చదవండి