ప్రతిరోజూ పొద్దునే పరగడుపున ఒక నిమ్మకాయ రసం గ్లాసుడు నీళ్ళలో కలుపుకుని కొంచెం తేనె వేసుకుని తాగితే అధిక బరువు తగ్గుతారట. రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటారని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నిమ్మకాయ వల్ల నోటి అరుచి, పైత్యం తగ్గుతాయి.
నిమ్మకాయలు అధికంగా దొరికే కాలంలో పది నిమ్మకాయలను రసం పిండి దాంట్లో వందగ్రాముల అల్లం చిన్న చిన్న ముక్కులుగా చేసి వేయాలట. అలాగే సరిపడినంత ఉప్పు, జీలకర్ర కూడా నిమ్మరసంలో కలపాలట. వాటిని మూడురోజుల పాటు అలాగే ఉంచిన తరువాత రసంతో పాటే అల్లం ముక్కలను ఎండబెట్టాలట.