నిమ్మరసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూసుకుంటుంది. జీర్ణ క్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు ఉండవు. ఇలా ఒకటి కాదు రెండు కాదు నిమ్మతో ఎన్నో ప్రయోజనాలు మనం పొందొచ్చు.
నిమ్మరసంలో నీళ్లు, ఉప్పు లేదా పంచదార వేసుకు తీసుకోవచ్చు. లేకపోతే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని ఉదయాన్నే తీసుకుంటే అజీర్తి మొదలైన సమస్యలు ఉండవు. ఇలా సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.