మెంతికూరతో ఆరోగ్య ప్రయోజనాలేంటి?

బుధవారం, 26 జూన్ 2019 (18:41 IST)
ఆకుకూరల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. ఆకుకూరలు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకం దూరం అవుతుంది. మెంతి ఆకుల వలన కూడా ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు. మెంతి కూర తింటే శరీరానికి కావలసిన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర చక్కగా పనిచేస్తుంది. 
 
శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి. మెంతి ఆకులు రక్తంలోని లిపిడ్ లెవల్స్‌పై మెరుగైన ప్రభావం చూపుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ ఆకులను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి తీసుకుంటే ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది. డయాబెటిస్‌ను నయం చేయడంలో బాగా పనిచేస్తుంది. 
 
మెంతి కూరలోని ఔషధ కారకాలు రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి. గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఈ మెంతి కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర కణజాలాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో మెంతి కూర చక్కగా పనిచేస్తుంది. ఈ మెంతి ఆకులను పేస్ట్‌లా చేసుకుని జుట్టుకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు