అల్పాహారంలో కోడిగుడ్డు, తృణధాన్యాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తద్వారా మధుమేహం, ఒబిసిటీ ఆవహించదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఉదయం అల్పాహారం సమయంలో పాలు తాగితే మధుమేహం టైప్ 2 రోగులకు మంచిదని పరిశోధనలో వెల్లడి అయ్యింది. అధిక ప్రొటీన్లు గల పాలును ఉదయం పూట తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్‌స్థాయిలు అదుపులో ఉంటాయని వైద్యులు చెప్తున్నారు.
తద్వారా ఆకలి కూడా తగ్గుతోంది. పాలలో ఉండే పాలమీగడ, కేసైన్ ప్రొటీన్లు విడుదల చేసే గ్యాస్ట్రిక్ హార్మోన్ల కారణంగా ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతోంది. దీనివలన ఆహారం మోతాదు అధికంగా తీసుకోకుండా మితంగా తీసుకునే వీలుంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.