కరోనా కాలంలో మునగ ఆకులను తేలికగా తీసిపారేయకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి, ప్రస్తుతం చాలా అవసరం. అవి మునగకాయలో చాలా ఉన్నాయి. అందుకే దీన్ని ఆహారంలో చేర్చుకోవాలి.
ఇంకా ఇందులో విటమిన్ బి, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి మేలు కలుగుతుంది. మునగకాయని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇంకా గొంతులో ఏర్పడే మంటను ఈ ఆకులు తగ్గిస్తాయి.