మారుతున్న వాతావరణంలో ప్రతియొక్కరిని వేధిస్తున్న సమస్య సైనస్. ఈ కాలంలో బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టె సమస్య కూడా ఇదే. దీని వల్ల తలనొప్పి, కళ్లు మండడం, దురద, ముక్కు నుండి విపరీతంగా నీరు కారడం, ముక్కు నొప్పి ఇలా అన్ని సమస్యలు కలుగుతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సైనస్ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం....
ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. దాంట్లో కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి ఆవిరిని పీల్చితే ముక్కులోని రంధ్రాలు తెరుచుకుని గాలి బాగా ఆడుతుంది. సమస్యకు పరిష్కారం కలుగుతుంది. నిమ్మ, ఉసిరి, కివీ పండ్లను తరచూ తీసుకుంటుంటే కూడా సైనస్ బారినుండి తప్పించుకోవచ్చు.