ఆపిల్ పండు కంటే అరటిపండు ఎంతో బెటరంట..

గురువారం, 6 అక్టోబరు 2016 (12:05 IST)
ఆపిల్ పండు కంటే అరటిపండు అనేక రెట్లు శ్రేష్టమైనదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేడ్లు ఆపిల్ పండ్లలో కంటే రెండింతలు ఎక్కువగా అరటి పండ్లలో ఉన్నాయి. ఫాస్పరస్ మూడింతలు, ప్రోటీన్ల శాతం కూడా ఆపిల్ కంటే అధికంగా ఉంది. విటమిన్ ఎ, ఇనుము శాతం, విటమిన్లు, పొటాషియం వంటివి ఆపిల్ కంటే అరటి పండులోనే అధికంగా ఉన్నాయి.  
 
ఇదే విధంగా ఒక అరటి పండు 23 గ్రాముల కార్పోహైడ్రేడ్లు, 12 గ్రాముల చక్కెర, 2.6 పీచు పదార్థాలు, ఒక గ్రామ్ ఫాట్, 9 మిల్లీ గ్రాముల విటమిన్ కలిగివుంది. తద్వారా శరీరానికి కావాల్సిన 90 కెలోరీలు అరటి పండులో ఉన్నాయి. 
 
ఇకపోతే.. అరటిపండు శరీర వేడిని తగ్గించడం, ఉదర సమస్యలకు చెక్ పెడుతుంది. అల్సర్‌కు అరటిపండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. అరటిలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉండటంతో అంటువ్యాధులు దరిచేరవు. 

వెబ్దునియా పై చదవండి