ఇలా జరిగితే కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ విడుదల కావడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. వేళ్ళతో ఆహారాన్ని కలుపుకుని ముద్దలుగా తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ జరుగుతుంది. చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల, వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.