బెండకాయను అన్నీ సీజన్లు తినొచ్చు. చలికాలం, వర్షాకాలంలో ఆస్తమా రోగులకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఆస్తమా రోగులు రోజూ ఆహారంలో ఏదో రూపంలో రెగ్యులర్‌గా బెండను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. వేడికి గురైన శరీరాన్ని చల్లబరిచే గుణం బెండకు ఉంది. బరువును తగ్గించడంలో బెండకాయ భేష్‌గా పనిచేస్తుంది. కూర్చున్న చోటే కూర్చుని ఉద్యోగాలు చేసేవారు.. మానసిక ఒత్తిళ్లకు కారణమయ్యే ఉద్యోగాలు చేసేవారు రోజూ తమ ఆహారంలో బెండకాయలు వుండేలా చూసుకోవాలి.
బెండకాయ అధిక బరువును తగ్గించడమే కాకుండా.. చెడు కొవ్వులను శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త పడుతుంది. చర్మసౌందర్యానికి పెంపొందింపజేస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టి, రోగనిరోధకశక్తిని పెంచి, కంటిచూపును మెరుగుపరిచి, ఎనీమియా, డయాబెటిస్‌ను బెండకాయ దూరం చేస్తుంది. మధుమేహంతో బాధపడేవాళ్లకు బెండకాయ ఎంతో మేలు చేస్తుంది. మహిళలల్లో రుతుక్రమ సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.