పనీర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. పన్నీర్లో ఏమేం పోషకాలున్నాయంటే.. వందగ్రాముల పన్నీర్లో 1.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 72 కేలరీలు ఉంటాయి. 83 గ్రాముల కాల్షియం ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్.
పన్నీర్లో కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే కాల్షియం ఎముకల్ని, దంతాల్ని బలంగా చేస్తుంది. అంతేకాదు శరీరంలో పేరుకున్న ఫ్యాట్‌ని కరిగించడానికి సాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.