నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకోవటం వల్ల మహిళల్లో రక్తపోటు 14 పాయింట్లు తగ్గుతున్నట్టు బయటపడింది. ఈ ప్రక్రియ ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో రక్తనాళాలు వదులుగా అవుతాయి, రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఇకపోతే కుర్చీలో ముందుకు వంగి కూచున్నప్పుడు రక్తపోటు పదహారు శాతం వరకు పెరుగుతుంది. మన మెడలో ప్రశాంతతకు సంబంధించిన సందేశాలను మెదడుకు చేరవేసే నాడులుంటాయి. ముందుకు వంగటం వల్ల మెడలోని వెన్నుపాము, డిస్కుల మీదా ఒత్తిడి పడుతుంది. దీంతో ఆ భాగంలోని సున్నితమైన నాడులు నొక్కుకుపోయి వాటి పనితీరు మందగిస్తుంది. అందువల్ల వీలైనంతవరకు నిటారుగా కూచుంటే మంచిది.