మజ్జిగలో మిరియాల పొడి చేర్చి తాగితే..?

శనివారం, 11 మే 2019 (14:59 IST)
మిరియాలు రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. నల్ల మిరియాలు శరీరంలో పేరుకున్న క్యాలరీలను కరిగిస్తాయి.


కొత్త ఫ్యాట్ సెల్స్ ఉత్పత్తి అవకుండా చూస్తాయి. మిరియాల్లో విటమిన్ ఎ,సి,కెలతో పాటు మినరల్స్, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ సహజసిద్ధమైన మెటబాలిక్ వంటివి శరీరానికి శనినిచ్చేలా పనిచేస్తాయి.
 
రోజూ రెండు మిరియాలు నోట్లో వేసుకుంటే శరీరంలోని మెటబాలిజంను క్రమబద్ధం చేస్తుంది. రోజూ మీరు తాగే టీలో చిటికెడు మిరియాల పోడి వేసుకుని తాగితే కూడా ఫలితం ఉంటుంది. రోజూ రెండు మిరియాలను దంచి.. మజ్జిగలో వేసుకుని తాగితే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 
రెండు, మూడు స్పూన్ల మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వున్న ప్రాంతంలో కడితే నొప్పి, వాపు తగ్గుతుంది.

అజీర్ణ సమస్యలతో బాధపడే వారు మిరియాలపొడికి కొద్దిగా బెల్లం కలిపి రోజూ రాత్రి పూట ఆహారం తినడానికి ముందు తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు