రోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు తింటే చాలా సులభంగా బరువు తగ్గుతారని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ఆహార పదార్థాల తయారీకి ఇతర నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఈ నూనెలోని మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను కాపాడతాయి. కాబట్టి బరువు పెరిగే సమస్యే ఉండదు.
అదేవిధంగా వారానికి రెండుసార్లు చేపలను తీసుకుంటే ఒబిసిటీ సమస్య వుండదు. చేపలలో క్రొవ్వు ఉండదు. కేలరీలు కూడా చాలా తక్కువ. కాబట్టి మటన్, చికెన్ జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు చేపలను ఆహారంలో భాగం చేసుకోండి.
రోజువారీ డైట్‌లో భాగంగా పచ్చని కాయగూరలు, ఆకుకూరలను తీసుకుంటూ ఉండాలి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కాబట్టి ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే కూరగాయలను ఎక్కువగా తింటే బరువు పెరగరు. వెజిటబుల్ సూప్స్ వల్ల కూడా క్యాలరీలు పెద్దగా పెరగవు. పైగా భోజనానికి ముందు వెజ్ సూప్ తీసుకుంటే ఆహారాన్ని మితంగా తీసుకునే అవకాశం వుంటుంది.