శీఘ్రస్ఖలనానికి ఉత్యుత్తమ చిట్కా ఇదే...

బుధవారం, 29 మే 2019 (20:30 IST)
వంటకాల్లోనేకాక అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించించే అల్లంకి చాలా ప్రాముఖ్యత ఉంది. మన పెద్దలు కూడా జ్వరం, జలుబు, తలనొప్పి వంటి కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు, అల్లం కషాయం, అల్లం టీ త్రాగమంటుంటారు. అనేక రుగ్మతలకు అల్లం దివ్యౌషధం. 
 
గ్లాసు నీటిలో నిమ్మకాయ రసం, అల్లం రసం, తేనె, ధనియాల రసం రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండె దడ, తల తిప్పడం, తలనొప్పి, అలసట తగ్గుతాయి. శరీరంపై వచ్చే దద్దుర్లు, తరచుగా జలుబు, తుమ్ములు రావడం, దగ్గు, ఆయాసం తగ్గుతాయి. 
 
పులి తేన్పులు తగ్గి జీర్ణశక్తి మెరుగవుతుంది. అల్లం, బెల్లం సమపాళ్లలో కలిపి నూరి రోజూ రెండు మూడుసార్లు తీసుకుంటే అరికాళ్లు, చేతుల్లో పొట్టు ఊడటం తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్దకం లేకుండా సుఖ విరేచనం అవుతుంది. 
 
ఒక స్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది. తులసి ఆకులు, పసుపు, అల్లం రసంతో నూరి దద్దుర్లు, దురద, మచ్చలు, మొటిమలు మొదలైనవాటిపై రాస్తుంటే అవి త్వరగా తగ్గుతాయి. ఆముదంలో అల్లపు రసం కలిపి చర్మానికి పూస్తే వివిధ చర్మ వ్యాధులు తగ్గుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు