బ్రౌన్ బ్రెడ్ తింటే శరీరానికి కలిగే ఉపయోగాలు ఏమిటి?

గురువారం, 10 ఆగస్టు 2023 (22:47 IST)
బ్రెడ్. బ్రెడ్‌లలో రకాలున్నాయి. మైదా చేసినవి, కేవలం గోధుమ పిండితో చేసినవి. గోధుమ పిండితో చేసిన బ్రెడ్‌ను బ్రౌన్ బ్రెడ్ అంటారు. ఈ బ్రెడ్ తింటే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బ్రౌన్ బ్రెడ్‌లో తృణధాన్యాలు ఉంటాయి, ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బ్రౌన్ బ్రెడ్ ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.
 
బ్రౌన్ బ్రెడ్‌లో ఉండే తృణధాన్యాలు గుండె స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బ్రౌన్ బ్రెడ్ విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కెలకి శక్తివంతమైన మూలం. బ్రౌన్ బ్రెడ్ 1-2 స్లైస్‌లను తినడం వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చని చాలామంది నమ్ముతారు. బ్రౌన్ బ్రెడ్ సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ను విడుదల చేయడం వల్ల మనసు ఉల్లాసంగా వుంటుంది.
 
తాజా బ్రౌన్ బ్రెడ్‌ను ఎంచుకోండి. రొట్టె వాసన, ఆకృతి చూసి అంచనా వేయవచ్చు. అలాగే తయారీ తేదీ, ప్యాకేజింగ్- గడువు తేదీని తనిఖీ చేయండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు