మెదడు చురుకుగా పని చేయాలంటే రెడ్‌మీట్‌కు దూరంగా ఉండండి!

గురువారం, 11 ఫిబ్రవరి 2016 (09:34 IST)
వయసు పెరుగుతున్నా మెదడు చురుకుగా ఉండాలన్నా.. పని చేయాలన్నా... రెడ్‌మీట్‌, స్వీట్లకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లతో మెదడు చురుకుగా పనిచేస్తుందని వారు చెపుతున్నారు.
 
కూరగాయలు, పండ్లు, చేపలు, నట్స్‌, సోయా గింజలను రోజువారీ ఆహారంలో తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేస్తుందట. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 28 వేల మంది వాలంటీర్లను, వారి ఆహార అలవాట్లను పరిశీలించారు. ఇందులో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్న 5,700 మందిలో కాగ్నిటివ్‌ డిక్లైన్‌ 14 శాతం తక్కువగా ఉండడం నిపుణులు గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి