సపోటా పండ్లను వేసవిలో తీసుకుంటే ఎంత మేలో తెలుసా?

మంగళవారం, 21 మే 2019 (19:01 IST)
వేసవి కాలంలో మనకు దొరికే పండ్లలో సపోటా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్లు వేడి ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ పండు మామిడి, పనస వర్గాలకు చెందింది. అంటే దీనిలో చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి. సపోటా తినడానికి చాలా రుచికరంగా ఉండటం వలన దీనిని మిల్క్ షేక్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. 
 
ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సపోటాలో కాపర్, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, నియాసిస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనేక రోగాలను నయం చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో సపోటా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిలోని క్యాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది. 
 
శిరోజాలకు కూడా సపోటా తగిన పోషణను అందిస్తుంది. అంతే కాకుండా దీనిని తరచుగా తింటే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. సపోటాలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ను ఇది తగ్గిస్తుంది. సన్ బర్న్స్ నుండి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. సపోటాలో ఉండే కాపర్, ఫాస్ఫరస్ చర్మానికి రక్షణ కల్పిస్తుంది. సపోటా శరీరంలో ఉన్న హార్మోన్లను బ్యాలెన్స్ చేసి, అడ్రినల్ గ్రంధులు చురుగ్గా ఉండేలా చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు