ఎక్కువసేపు వేడినీరు తాగడం హానికరం. చాలా వేడి నీటిని తాగడం వల్ల పెదవులు, నోరు మండుతున్నట్లవుతాయి. నోటిలో పొక్కులు రావచ్చు. అన్నవాహిక, జీర్ణవ్యవస్థలోని సున్నితమైన పొరలు కూడా దెబ్బతింటాయి. నిరంతరం వేడి నీటిని తాగడం వల్ల అంతర్గత అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. ఏకాగ్రత స్థాయిలు ప్రభావితం కావచ్చు. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచవచ్చు.