జ్ఞాపకశక్తి పెరగాలంటే సరిగ్గా 8 గంటలు నిద్రపోండి..!

బుధవారం, 25 నవంబరు 2015 (16:42 IST)
జ్ఞాపకశక్తి పెరగాలంటే సరిగ్గా 8 గంటలు నిద్రపోవాల్సిందేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఎనిమిది గంటల పాటు నిద్రపోయిన వారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందని అధ్యయనం తేల్చింది. బ్రిగామ్ అండ్ ఉమెన్ ఆసుపత్రిలో జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్లు జెన్ ఎఫ్ డఫీ పేర్కొన్నారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారిని రాత్రి సమయంలో సరిపడా నిద్రపొమ్మన్నారు. 
 
ఆపై నిర్వహించిన పరీక్షలో సుమారు 20 మంది వ్యక్తుల (అడల్ట్స్) కలర్ ఫొటోలను, వారి పేర్లను వారికి చూపించారు. ఆ ఫోటోల్లో ఉన్న వారి రంగులు, పేర్లను సరిగ్గా 8 గంటల పాటు నిద్రించిన వారు సులభంగా కనిపెట్టగలిగారని పరిశోధనలో తేలింది. ఎనిమిది గంటలు పాటు నిద్రించిన వారిలో 12 శాతం మంది జ్ఞాపకశక్తి కలిగి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగారు. 
 
సరిపడా నిద్రించిన తర్వాత నేర్చుకునే కొత్త విషయాల ద్వారా మెరుగైన జ్ఞాపకశక్తిని పొందవచ్చని డఫీ పేర్కొన్నారు. అయితే ఆరు, ఏడు గంటలు నిద్రపోయిన వారిలో జ్ఞాపకశక్తి తగ్గిందని డఫీ చెప్పారు. తక్కువగా నిద్రించిన వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయారన్నారు. 

వెబ్దునియా పై చదవండి