సరిగ్గా నిద్రలేకపోతే ఏమవుతుందో తెలుసా..?

శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:14 IST)
ప్రతి ప్రాణికి ఆహారం, గాలి, నీరు ఎంత అవసరమో అలానే అలసిన శరీరానికి విశ్రాంతి, నిద్రకూడా చాలా అవసరం. పగలంతా అలసిపోయిన శరీరానికి నిద్రపోవడం వలన మనిషి శరీరంలో నూతనోత్తేజాన్ని నింపుతుంది. 
 
అదే శరీరానికి తగినంత నిద్ర లేకపోతే మరుసటి రోజు అలసట, ఇతరులపై కోపం, పనిమీద ఏకాగ్రత కుదరకపోవడం, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడం, మతిమరుపు వంటివి జరుగుతుంటాయి. అదే కంటినిండా నిద్రపోయినవారిలో ఉత్సాహం ఉరకలేస్తుంటుంది అంటున్నారు వైద్యులు. 
 
కాబట్టి ఒకరోజు నిద్రలేకపోతే మనిషి ఒత్తిడికి లోనవుతుంటాడు. దీంతో ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రభావం ఉంటుందంటున్నారు వైద్యులు. నిద్రలేమి కారణంగా ఒత్తిడి పెరగడం, రక్తపోటు, శరీరం లావు పెరగడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు