ముఖానికి వ్యాయామం కావాలా...పగలబడి నవ్వండి

బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (11:48 IST)
నవ్వు నాలుగు విధాల చేటు అనే సామెతకు మారుపేరుగా నవ్వు నలభై విధాల మంచిదని వైద్యులు అంటున్నారు. పెదవులతో చిందించే చిరునవ్వుల కంటే, పగలబడి నవ్వే నవ్వుల వల్ల ముఖ కండరాలకు, పొట్ట కండరాలకు తగినంత వ్యాయామం లభించి, కేలరీలు కరుగుతాయని నిపుణులు అంటున్నారు. 
 
నవ్వు వల్ల మానసికంగా ఉల్లాసంగా, శారీరకంగా చురుగ్గా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. రోజులో ఎక్కువ సేపు నవ్వడం వల్ల శరీరం నాజూకుతనాన్ని సంతరించుకుంటుందని పరిశోధకులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి