చెరుకు రసం ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

మంగళవారం, 27 డిశెంబరు 2022 (18:02 IST)
చెరుకు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో వుంది. చెరుకు రసంలో ఉండే గ్లూకోజ్‌ను శరీరం వేగంగా గ్రహించి వెంటనే ఉపయోగించుకుటుంది. కనుక తక్షణ ఉత్తేజాన్నిస్తుంది. ఇంకా చెరుకు రసం చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
 
చెరుకు రసంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
 
కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరుకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
 
కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్ఛిన్నమై మూత్రంలో వెళ్లిపోవడానికి చెరుకు రసం దోహదం చేస్తుంది.
 
చెరుకు రసంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, ఫాస్పరస్‌లు సమృద్ధిగా ఉంటాయి.
 
ఆల్కలైన్ స్వభావం కలిగిన చెరుకు రసం ప్రోస్టేట్, కోలన్, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.
 
చెరుకు రసం తాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.
 
వీటిలో క్యాలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ కనుక ఊబకాయులు తీసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి