వేసవిలో కాలుష్యం వలన కలిగే వ్యాధులకు? ఎందుకు?

సోమవారం, 21 మే 2018 (11:57 IST)
ప్రస్తుతం వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతోపాటు మారుతున్న జీవనశైలి యువతను ముప్పతిప్పలు పెడుతోంది. నగరాలు, పట్టణాల్లో ఆటస్థలాలకు ఎక్కువ శ్రద్ధ కనబరచాల్సి వస్తోంది. ఇండోర్ గేమ్స్ ఆడటంతో ఆస్తమా బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు ఆస్తమా బారిన పడే వారిసంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చివరికి చిన్నారులు సైతం ఆస్తమా బారిన పడుతున్నారు. కారణం కాలుష్యం.
 

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఆటస్థలాల కొదవ ఏర్పడటంతోపాటు పిల్లలు ఇండోర్ గేమ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం. ఇండోర్ గేమ్స్ ద్వారా ఇండ్లలోని కర్టెన్లు, కార్పెట్లలో చేరుకున్న దుమ్ము, ధూళి కారణంగా ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. దీంతో వారిలో అలర్జీ, ఆస్తమా తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంతే కాకుండా ఎప్పుడూ ఇండ్లలోని నాలుగు గోడల మధ్య ఉండటంచేత వారిలో సమతుల్యమైన జీవనశైలిని అలవరచుకోలేకపోతున్నారు.  
 
వాతావరణం మారడంతోటే సమస్య మరింత జఠిలమౌవుతోంది. వాతావరణం మారినప్పుడు పిల్లల్లో అలర్జీ, ఆస్తమా లక్షణాలు బయటపడతాయి. మధ్యవయస్సుల్లో దాదాపు ఐదు నుంచి పది శాతం మేరకు అలర్జీ, ఆస్తమా బారిన పడినవారుంటున్నారు. అదే కిశోరావస్థ, యువకుల్లో ఎనిమిది నుంచి పదిహేను శాతం మేరకు ఈ వ్యాధి బారీన పడిన వారున్నట్లు పరిశోధనల్లో తేలిందని తెలిపారు.
 
వైరల్ ఇన్ఫెక్షన్ నుంచే ఆస్తమా ప్రారంభమౌతుంది. యువకులు తరచూ జలుబు, జ్వరంతో బాధపడుతుంటే అలర్జీకి సంకేతంగా అభివర్ణించవచ్చు. దీంతో సరైన సమయంలో అలర్జీకి చికిత్స తీసుకుంటే ఆస్తమా బారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చూచిస్తున్నారు. అలర్జీకి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మెలమెల్లగా ఆస్తమా వ్యాధికి దారితీస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు