చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడిపోతుంటే...?

శనివారం, 6 ఫిబ్రవరి 2016 (08:55 IST)
ఇంత చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటానికి ఎన్నో కారణాలుంటాయి. ఇక తెల్లబడిన జుట్టును దాచుకునే ఒకే ఒక్క మార్గం కలరింగ్. కలరింగ్‌కు ఉసిరి బాగా సహకరిస్తుంది. ఎలాగో తెలుసుకుందాం... 
 
ప్రతిరోజూ ఒక కప్పు ఉసిరికాయ రసం తాగండి. రెండు మూడు కప్పుల నీటిలో గుప్పెడు ఉసిరికాయలను వేసి మెత్తని పేస్ట్‌లా చేసి హెన్నా పొడితో బాగా కలిపి కుదుళ్లకి పట్టించాలి. క్రమంగా చేస్తే తెల్లని జుట్టు నల్లగా మారుతుంది.
 
నిమ్మరసం, కాఫీ పొడి నాలుగేసి టీ స్పూన్లు, పచ్చి గుడ్డుసొన, రెండు టీస్పూన్ల నూనె, వడగట్టిన ఉసిరి రసం కలిపి చక్కని పేస్ట్ తయారు చేసి రెండు మూడు గంటలు అలాగే నాననిచ్చి జుట్టుకు పట్టించాలి. తర్వాత తలస్నానం చేస్తే తెల్లని జుట్టు మటుమాయవుతుంది.

వెబ్దునియా పై చదవండి