సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రతి సిగరెట్ ప్యాక్‌నా, సినిమా థియేటర్లలో, ఇలా ప్రతిచోటా రాసివున్నా ఎవరూ పట్టించుకోరు. అలాగే, పొగతాగడం వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడుతారని హెచ్చరించినా ఏ ఒక్కరికీ బోధపడదు. అయితే, పొగతాగే పురుషులకు ఇపుడు కొత్త సమస్య వచ్చింది.
సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగే వాళ్లల్లో 13 శాతం మంది సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాళ్లేనని మహిళల్లో అండోత్పత్తికి సిగరెట్ అలవాటు అడ్డుపడితే, పురుషుల్లో వీర్యకణాల వృద్ధిని నాశనం చేస్తుంది. యువకులు, కొత్తగా పెళ్ళయిన వాళ్లయినా ఈ విషయం తెలుసుకుని సిగరెట్ మానితే సంసార బంధం చక్కగా సాగిపోతుందని ఈ పరిశోధకులు చెపుతున్నారు.