కందులు, పెసర్ల వంటి పప్పులు క్యాన్సర్ల బారినపడకుండా కాపాడతాయి. తరచుగా పప్పులు తినే మహిళలకు రొమ్ముక్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాల్లో బయటపడింది. ప్రోస్టేట్, మలద్వార క్యాన్సర్ల బారినపడకుండా కాపాడుతున్నట్లు వెల్లడైంది. వీటికి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణమూ ఉంది.
ఇనుము, క్యాల్షియం, మాలిబ్డినమ్ వంటివి ఉలవల్లో మెండుగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ గుణాలు గల ఫాలీఫెనాల్స్ కూడా ఎక్కువే. ఇవి క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. యాంటీబాడీలు, స్వీయరోగనిరోధక చర్యల్లో కనిపించే హిమోగ్లుటినిన్ కూడా వీటిల్లో కనిపిస్తుంది. ఉలవలు కొలెస్ట్రాల్, కడుపు ఉబ్బరం తగ్గటానికీ తోడ్పడతాయి.