పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడం.. ఆహారాన్ని సమయానికి తీసుకోకపోవడం, సరైన సమయానికి నిద్రపోకపోవడంతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవడంతో పాటు వ్యాధినిరోధక శక్తి తగ్గేందుకు కూడా కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారాన్ని 8.30 గంటల్లోపు, మధ్యాహ్నం పూట 1.30 గంటల్లోపు ఆహారాన్ని తీసుకోవాలి.
రాత్రి మాత్రం 9.30 గంటల్లోపు ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి పది దాటిన తర్వాత భోజనం చేయడం ఏ మాత్రం మేలు చేయదని ఆహారం పట్ల నిర్లక్ష్యం, రోజుకు 8 గంటల కంటే తక్కువ నిద్ర ద్వారా అనారోగ్య సమస్యలు తప్పట్లేదని.. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది.
మరుసటి రోజుకి సరిపడా.. శారీరక, మానసిక శక్తి సమకూరాలంటే కంటి నిండా నిద్రపోవాలి. కాబట్టి పదిగంటలలోపు నిద్రించే అలవాటు చేసుకోవాలి. నిద్రలేమి కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. రాత్రిపూట చిరుతిళ్లు తినడం మంచిది కాదు. తద్వారా డయాబెటిస్ లాంటి వ్యాధులు తప్పవు. దానివల్ల డయాబెటిస్‌లాంటి రోగాలు వస్తాయి.
జీవక్రియ, హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపి బరువు, ఇన్సులిన్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగేలా చేస్తాయి. అందుకే సమయానికి ఆహారం తీసుకోవడం.. కంటి నిండా నిద్రపోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.