ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: గింజలు, సాల్మన్, తృణధాన్యాలు, ఆలివ్ నూనె వంటి గుండె-ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు, ఈ రకమైన ఆహారం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.
ధూమపానం మానేయండి: పొగాకు నుండి వచ్చే నికోటిన్ గుండె, రక్త నాళాలను దెబ్బతీస్తుంది. దీనిని మానుకోవడమే మంచిది. తద్వార గుండె, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారం అవుతాం.