ప్రతి అరగంటకు ఒకసారి వేడినీళ్లను తాగినట్లుగా సిప్ చేస్తూ తాగుతుంటే దీర్ఘకాలంలో చాలా వ్యాధులు నయమవుతాయి. కాచిన పాలను, కాచిన నీటిని వేడిచేయకుండా తాజా పాలును, కొత్త నీటిని అప్పుడప్పుడు వేడీచేసుకుని సేవించడం ఉత్తమం.
అలాగే భోజనానికి ముందు నీరు తాగడం మంచిది కాదు. అది మందాగ్ని రూపంలో శరీరాన్ని కృశింపజేస్తుంది. మధ్యమధ్యన నీరు తాగకుండా భోజనం తర్వాతే నీరు తాగితే అది ఊబకాయానికి దారితీస్తుంది. ఛాతీ, కంఠం, శిరస్సుల్లో కఫాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే భోజనం మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే మంచిది.