భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే?

మంగళవారం, 2 జనవరి 2018 (10:21 IST)
భోజన సమయంలో లేకుంటే భోజనం చేసిన వెంటనే నీరు తాగడం ద్వారా జీర్ణరసాలు పలుచబారుతాయి. తద్వారా ఆహార పదార్థాలు అంత సులువుగా జీర్ణం కావు. కొంతమంది రోజుకు ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు సేవిస్తారు. దీనివల్ల నీటిని తిరిగి శరీరం నుంచి బయటకు పంపడంలో కిడ్నీలపై అనవసరపు భారం పడుతుంది. అందుకే శరీరానికి అవసరమయ్యే నీరు మూడు లీటర్లే. 
 
ఆ పరిమితిని పాటించడమే ఆరోగ్యకరమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కాబట్టి రోజుకు మూడ లీటర్ల నీరు తాగితే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. ఇలా చేస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యల నుంచి దూరంగా వుండొచ్చు. 
 
భోజనానికి అరగంట ముందు అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలి. భోజన సమయంలో జీర్ణప్రక్రియ కోసం కేవలం ఒకటి రెండు గ్లాసుల నీరు తీసుకోవచ్చు. అయితే భోజనం చేస్తున్నప్పుడే అమితంగా నీరు తీసుకోవడం మాత్రం చేయకూడదు. అలా చేస్తే జీర్ణక్రియకు దెబ్బేనని వైద్యులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు