పరగడుపున నీళ్లు తాగితే.. ఏం జరుగుతుంది?

బుధవారం, 13 జనవరి 2016 (09:10 IST)
చాలా మంది నీరు తాగేందుకు ఆసక్తి చూపరు. కానీ వైద్యుడు మాత్రం ప్రతి రోజూ కనీసం రెండు లీటర్ల నీరు తాగాలని చెపుతుంటారు. అయితే, పగటి పూట నీరు తాగినా తాగకపోయినా.. పరగడుపున మాత్రం ఖచ్చితంగా నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెపుతున్నారు. పరగడపున నీరు తాగడం వల్ల.. 
 
రక్త కణాలను శుద్ధి చేసి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధికి తోడ్పడుతుంది.
పరిగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగితే పెద్దపేగు శుభ్రపడి, మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది.
బాడీ మెటబాలిజం చైతన్యమై బరువును అదుపులో ఉంచుతుంది.
శరీరం ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి